టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందటం.. స్మార్ట్ ఫోన్ లు చేతిలో కొచ్చాక వాటిలో ఏర్పడ్డ గ్రూపులతో కొత్త పరిచయాలతో ప్రజలకు మంచి ఎంత జరుగుతోందో…. చెడు కూడా అంతే జరుగుతోంది. పెళ్లైన 37 ఏళ్ళ యువతితో వాట్సప్ లో చాటింగ్ చేసిన యువకుడు ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. అందుకు ససేమిరా అనటంతో ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు.
తమిళనాడులోని కొళత్తూరుకు చెందిన వివేకానందన్ కు వాట్సప్ కమ్యునిటీ గ్రూప్ లు ద్వారా చెన్నైకి చెందిన వివాహిత (37) మహిళ పరిచయం అయ్యింది. వివేకానందన్ ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. కమ్యునిటీ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యాడు కదా అని వివాహిత వివేకానందతో వాట్సప్ లో చాటింగ్ చేయటం మొదలెట్టింది.
చాటింగ్ లో ఆమె ఇష్టాలు, అలవాట్లు సొంత విషయాలు అన్నీ తెలుసుకున్నవివేకానంద ఒకరోజు…..తన కోరిక తీర్చమని… మనుసులో కోరిక బయట పెట్టాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించి అతడితో చాట్ చేయటం మానేసింది.
దీంతో ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు వివేకానంద. ఆమె వాట్సప్ కు అసభ్యకరమైన అశ్లీల ఫోటోలు పంపుతూ ఆమెను లైంగికంగా వేధించ సాగాడు. దీంతో ఆమె అతడి నెంబరు బ్లాక్ చేసింది.
దీంతో కక్ష పెంచుకున్న వివేకానంద ఒకరోజు డైరెక్టుగా ఆమె ఇంటికి వెళ్లి తన కోరిక తీర్చాలని…అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మనిద్దరి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ అంతా భర్తకు చూపిస్తానని బెదిరించాడు. అతడి బెదిరింపులకు లొంగని ఆమె ఎదురుతిరిగటంతో నీ భర్తను చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు.
దీంతో ఆందోళన చెందిన మహిళ చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివేకానందపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మార్చి 13న వివేకానందను అరెస్టు చేసి చెన్నైలోని పుళల్ జైలుకు తరలించారు.
Also Read | NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు