పెళ్లి కాలేదని.. రైలు కింద తలపెట్టి

వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

  • Publish Date - March 23, 2019 / 02:49 AM IST

వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పెయింటింగ్‌ పనులు చేసే మహమ్మద్‌ సాబేర్‌(31) పెళ్లి కాట్లేదని నెక్లెస్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంఎస్‌మక్తాకు చెందిన షేక్‌ హైదర్‌కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మహమ్మద్‌ సాబేర్‌(31) హైదర్‌కు రెండవ కొడుకు.

అయితే ఇద్దరు అక్కలు, అన్న, ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేసి, సాబేర్‌ తల్లిదండ్రులు చనిపోయారు. అయితే సాబెర్ పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్నేహితుల వద్ద బాధపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నెక్లెస్‌ రోడ్డులోని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, ఎంఎంటీఎస్‌ రైలు సమీపంలోకి రాగానే పరిగెత్తి వెళ్లి పట్టాలపై తలపెట్టాడు. అందరూ చూస్తుండగానే అతని తల, మొండెం రెండుగా విడిపోయాయి. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు పోలీసులు.
Read Also : ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు‌