Extra Marital Affairs : కీచకుడు…అక్రమ సంబంధాలు పెట్టుకోమని కారులో ఎక్కించుకుని చిత్రహింసలు

నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు.

Extra Marital Affairs : నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోయే సరికి వారితో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేసి అర్ధరాత్రి  నడిరోడ్డుపై వదిలేసాడు.

మహబూబ్ నగర్‌లో మ్యారేజి బ్యూరో నిర్వహించే 37 ఏళ్ల మహిళతో జడ్చర్లకు చెందిన వెంకటేశ్ గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 8 నెలలుగా వీరి బంధం కొనసాగుతోంది. ఇటీవల కొద్దిరోజులుగా ఆమెను కలవటంలేదు. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కలవలేక పోతున్నానని చెప్పాడు. తాను అండగా ఉంటానని ఆమెకు చెప్పి.. తన భార్యతోనూ మాట్లాడించాడు.

ఈమధ్యకాలంలో మహబూబ్ నగర్ కు చెందిన తన మిత్రుడు వెంకటేష్ తదితరలుతో కూడా వివాాేతర సంబంధం పెట్టుకోవాలని సూచించాడు. ఆ మాటలకు మహిళ షాక్ కు గురైంది. అతడి సూచనను తిరస్కరించింది. ఈక్రమంలో జులై 2న ఆమెను జడ్చర్లలోని తన ఇంటికి పిలిపించాడు. అక్కడ ఆమను కారులో ఎక్కించుకుని తనబావమరిదితో కలిస మహబూబ్ నగర్ వెళ్లాడు. అక్కడి నుంచి క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్ కు వెళ్లారు. అక్కడ దాబాలో పెద్ద వెంకటేష్ గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేష్ గౌడ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కారు.

తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఐదుగురు కలిసి ఆమెను కారులో చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మయూరి నర్సరీ సమీపంలో ఆమె పర్సు,మొబైల్ లాక్కుని కారులోంచి దింపి వెళ్లిపోయారు.

అక్కడినుంచి కాలినడకన అర్ధరాత్రి వేళ మహబూబ్ నగర్ లోని పాతడీఎస్పీ ఆఫీసుకు చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవటంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటువద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడు వెళ్లబోసుకుంది. వారుఆమెను వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి ఆమెవద్ద ఫిర్యాదు తీసుకుని కేస దర్యాప్తు చేస్తున్నారు.

కాగా… నిందితులు పోలీసులను ప్రభావితం చేశారని… తన ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు ఆడియో రికార్డింగ్ లు డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారని బాధితురాలు ఆరోపించింది.

ట్రెండింగ్ వార్తలు