Surat : కన్న కూతుర్ని క్రూరంగా 25 సార్లు కత్తితో పొడిచి.. భార్యపై దాడి చేసిన వ్యక్తి
సూరత్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని 25 సార్లు కత్తితో పొడిచి చంపాడు కసాయి తండ్రి. అడ్డొచ్చిన భార్యను చంపడానికి ప్రయత్నించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
- Lakshmi 10tv
- Published On : May 31, 2023 / 11:35 AM IST
Surat
Surat Crime News : సూరత్‌లో దారుణం జరిగింది. ఇంట్లో గొడవల కారణంగా కూతురిపై పగ పెంచుకున్నాడు తండ్రి.. కత్తితో దారుణాతి దారుణంగా పొడిచి చంపాడు. అడ్డొచ్చిన భార్యను తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్
సూరత్‌లోని కడోదరలో కూతుర్ని దారుణంగా కడతేర్చిన తండ్రి ఉదంతం వెలుగు చూసింది. రామానుజ అనే దుండగుడు తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్యనగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. తన కుమార్తె టెర్రస్‌పై నిద్రపోతున్న సమయంలో భార్యతో గొడవకు దిగాడు. గొడవకు మేలుకుని కలగచేసుకున్న కూతురుని పట్టుకుని రామానుజ 25 సార్లు కత్తితో పొడిచాడు. తన ప్రాణాలు కాపాడుకోవాలని పక్కన గదిలోకి పరుగులు తీసినా తరిమి తరిమి పొడిచి చంపాడు. కూతురిపై దాడి తరువాత భార్యను చంపాలని డాబాపైకి ఎక్కాడు. తల్లిని కాపాడుకోవడానికి అడ్డం వచ్చిన పిల్లలకు సైతం గాయాలయ్యాయి. ఈ దారుణమంతా సీసీ ఫుటేజీలో రికార్డైంది.
Diamond Rakhis : సూరత్ లో వజ్రాల రాఖీలు..ధర ఎంతో తెలుసా..?
సమాచారం అందుకున్న పోలీసులు రామానుజను అరెస్టు చేశారు. అతనపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. మరోవైపు అతని దాడిలో గాయపడ్డ భార్య, పిల్లలు చికిత్స పొందుతున్నారు.
