Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్

చీరకట్టులో 15000 మంది మహిళలు ఒకేచోటకి చేరారు. డ్యాన్స్‌లు, పాటలతో సందడి చేశారు. సూరత్‌లో జరిగిన భారీ "శారీ వాకధాన్" లో పాల్గొనేందుకు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు తరలి రావడం విశేషం

Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్

Saree Walkathon

భారతీయ మహిళల వస్త్రధారణలో చీరకున్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీర (Saree) మహిళల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. పండుగలకు, పెళ్లిళ్లలో చాలామంది మగువలు రంగురంగుల చీరలు ధరిస్తూ ఉంటారు. అయితే 15000 మంది మహిళలు ఒకేసారి, ఒకేచోట చీరకట్టుతో కనిపిస్తే? అదెలా సాధ్యం అనుకోకండి. సూరత్ లో జరిగిన “శారీ వాకథాన్” (nSaree Walkatho) అందుకు వేదిక అయ్యింది.

Diamond Rakhis : సూరత్ లో వజ్రాల రాఖీలు..ధర ఎంతో తెలుసా..?

మహిళా సాధికారత (women empowerment), మహిళల్లో ఫిట్ నెస్‌పై (fitness) అవగాహన కల్పించడం కోసం సూరత్ మున్సిపాలిటీ మరియు సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఈరోజు “శారీ వాకథాన్” అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 15000 మంది మహిళలు పాల్గొని డ్యాన్స్‌లు, పాటలతో సందడి చేశారు. ఈ వాకథాన్ పోలీసు పరేడ్ గ్రౌండ్ (Police Parade Ground) నుండి ప్రారంభమై పార్లే పాయింట్ వంతెన (Parle Point Bridge) దగ్గర వరకు సాగి మళ్లీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంది. ఇక ఈరోజు ఉమ్రా పార్టీకి ( Umra Party ) సంబంధించిన ప్లాట్ లో సూరత్ మున్సిపాలిటీ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

నవరాత్రి వేడుకల్లో…సూరత్ మహిళల వినూత్న టాటూలు

ఇండియాలోనే ఇంత పెద్ద “శారీ వాకథాన్” నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి  13,900 మంది మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు. విదేశాల నుంచి సూరత్ ‌‌కు వచ్చిన వారు సైతం ఈ వాకథాన్‌‌కి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్ (Darshana Zardosh ), సీఆర్ పాటిల్ (CR Patil), హర్ష్ సంఘ్వీ (Harsh Sanghvi ) పాల్గొన్నారు.