కాపురానికి పంపడం లేదని భార్య మేనమామను చంపేశాడు

కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు

  • Publish Date - February 22, 2020 / 07:58 AM IST

కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు

కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజయ్‌రాజుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త సరిగా చూసుకోవడం లేదని శ్రీదేవి ఫిబ్రవరి 18న తల్లి ఇంటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు సుజయ్‌రాజు గురువారం వచ్చి వెళ్లాడు. మళ్లీ శుక్రవారం వచ్చి భార్యను పంపమని అడగ్గా.. వివాదం పరిష్కారమయ్యాకే పంపుతామని అతని అత్తింటి వారు చెప్పారు. 

అత్తింటివారు అడ్డు చెప్పడంతో.. తన చిన్న కూతురిని కారులో ఎక్కించుకొని వెళ్తున్న సుజయ్‌ రాజుకు శ్రీదేవి మేనమామ గుంజ శంకర్‌ అడ్డుపడ్డారు. ఐతే..కారు బానెట్‌పై ఉన్న ఆయనను అలాగే హుజూర్‌నగర్‌ రోడ్డు నుంచి జాన్‌పహాడ్‌ రోడ్డువైపు తీసుకెళ్లి కిందపడేసిన సుజయ్‌రాజు.. కారుతో తొక్కించాడు. తీవ్రంగా గాయపడ్డ శంకర్‌ను ఆసుపత్రికి తరలించేసరికి మృతిచెందారు. శంకర్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

బంధువుల ఇంట్లో వివాదం చక్కబెట్టేందుకు ప్రయత్నించిన శంకర్‌ యాక్సిడెంట్‌కు బలయ్యాడు. దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఉన్న సుజయ్.. శంకర్‌ను కారుతో ఢీకొట్టాడు. దీంతో అతడు ఎగిరి కారు బానెట్ మీద పడిపోయాడు. కారు ఆపాలని ఎంతగా రోదించినా… మద్యం మత్తులో ఉన్న సుజయ్ వినలేదు. కారు ఆపకుండా కొంతదూరం అలాగే వెళ్లాడు.

కారు బ్రేక్ కొట్టడంతో శంకర్ కిందపడిపోయాడు. కిందపడిన శంకర్‌ను కారు ఈడ్చుకుంటూ 60 అడుగుల వరకు వెళ్లింది. ఈ ఘటనను చూసిన స్థానికులు… సుజయ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు మద్యం మత్తులో ఉండటంతో ఎవరూ వారించలేకపోయారు. బాధితుడు శంకర్‌ను ఆస్పత్రికి వెళ్లేలోపే అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం అడ్డుకోబోగా దొరక్కుండా కూతురితో సహా సుజయ్ పరారయ్యాడు.