సాధారణంగా పిల్లలు ఇంట్లో ఫోన్లతో ఆడుకోవడం కామన్. తెలిసి తెలియని వయస్సులో పిల్లలు ఆ ఫోన్లలో గేమ్స్, వీడియోలు చూసి సంతోషపడుతుంటారు. అదే అలవాటుతో ఓ ఏడేళ్ల పిల్లాడు పక్కంటోళ్ల ఫోన్‌తో ఆడుకుంటూ పగలకొట్టాడు. ఆ విషయం తెలిసిన పక్కంటోళ్లు ఆవేశంతో పిల్లాడి తండ్రిని రాడ్లతో కొట్టిచంపేశారు పక్కింటోళ్లు. ఈ ఘటన పశ్చి బెంగాల్ లోని మాల్దా జిల్లాలో జరిగింది.
పిల్లాడు స్మార్ట్ ఫోన్ పగలకొట్టాడంటూ అలిముల్ షేక్ అనే 31ఏళ్ల వ్యక్తిపై ఘర్షణకు దిగాడు పక్కంటి వ్యక్తి మల్లా బక్కాస్. మీ పిల్లాడు మా స్మార్ట్ ఫోన్ దొంగిలించి పగలకొట్టాడంటూ గొడవ పెట్టుకున్నాడు. పిల్లాడికేం తెలుసండీ.. అంటూ తండ్రి బదులివ్వడంతో మరింత రెచ్చిపోయిన బక్కాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి దాడికి దిగాడు. విచక్షణ లేకుండా రాడ్లతో పిల్లాడి తండ్రిని దారుణంగా కొట్టి చంపేశారు. తాము ఎంతగా వారిస్తున్నా వినకుండా అలిముల్ షేక్ పై దాడి చంపేశారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అంతకుముందు బక్కాస్ మనవుడు.. షేక్ కొడుకు ఇద్దరూ ఫోన్‌తో ఆడుకున్నారు. ఆ తర్వాత ఫోన్ కనిపించలేదు. దాంతో షేక్ కుమారుడే ఫోన్ దొంగలించడంటూ బక్కాస్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో షేక్ ఇంట్లోకి తన కుమారులతో కలిసి వచ్చి రాడ్లు, లాఠీలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన షేక్ ను రక్షించేందుకు అతడి సోదరుడు వాహబ్ ప్రయత్నించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలో షేక్ మృతిచెందినట్టు సోదరుడు వాహబ్ తెలిపాడు.
ఈ ఘటనపై షేక్ కుటుంబ సభ్యులు కకలియాచాక్ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఐదుగురు నిందిుతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. షేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించినట్టు మాల్దా పోలీసు అధికారి అలోక్ రాజోరియా తెలిపారు.