అప్పు ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని కోరడం ప్రాణం తీసింది. స్నేహితుడే చంపేశాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ
అప్పు ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని కోరడం ప్రాణం తీసింది. స్నేహితుడే చంపేశాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో జరిగింది. గోపీకృష్ణ, కృష్ణ ప్రసాద్ స్నేహితులు. రెండేళ్ల క్రితం కృష్ణప్రసాద్ దగ్గర గోపీకృష్ణ రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత తన అప్పు చెల్లించాలని కృష్ణ ప్రసాద్ అడిగాడు. అయితే గోపీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రసాద్ నుంచి ఒత్తిడి పెరగడంతో.. ఆగ్రహానికి గురైన గోపీకృష్ణ.. ప్రసాద్ హత్యకు ప్లాన్ చేశాడు. కృష్ణప్రసాద్‌ను పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు పథకం వేసిన గోపీకృష్ణ.. కృష్ణప్రసాద్‌కు మాయమాటలు చెప్పాడు. మద్యం తాగుదామని పిలిచాడు. అతడి మర్డర్ ప్లాన్ గురించి తెలియని ప్రసాద్ నమ్మి వెళ్లాడు. గోపీతో కలిసి వెళ్లి ఊరి సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. ఇద్దరూ మద్యం సేవించారు. సమయం చూసి ప్రసాద్‌పై గోపీ దాడి చేశాడు. రాళ్లతో కొట్టి చంపాడు.
ప్రసాద్‌ను చంపి ఆదివారం(నవంబర్ 24,2019) రాత్రి పారిపోయిన గోపీ.. సోమవారం(నవంబర్ 25,2019) ఉదయం క్రోసూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను కృష్ణప్రసాద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.