దొంగతనానికి వెళ్లి.. జాబ్ అప్లై చేశాడో ప్రబుద్ధుడు. అందులో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. జాబ్ అప్లై చేసిన రెండో రోజే వచ్చేశారు పోలీసులు. నేరుగా అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చి పట్టుకుపోయారు. నార్త్ కాటాసౌక్యూవాలోని పిజ్జా డొరోలో నికోలస్ మార్క్ (22) చొరబడ్డాడు.
కుటుంబమంతా కలిసి నడుపుతున్న ఆ పిజ్జా రెస్టారెంట్ లో జాబ్ కూడా అప్లై చేశాడు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న కత్తితో అక్కడ ఉద్యోగిని బెదిరించి.. 220డాలర్లు ఉన్న టిప్ జార్ తీసుకుని పారిపోయాడు. ఇవన్నీ చేసేముందే తాను అప్లై చేసిన జాబ్ అప్లికేషన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫో, అడ్రస్ అన్నీ వదిలేశాడు.
https://10tv.in/ipl-2020-schedule-delayed-due-to-spike-in-abu-dhabi-covid-19-cases/
తనతో పాటు తెచ్చుకున్న సంచి వదిలేశాడు. అందులో సిరంజీలు, డ్రగ్ పారాఫెర్నెలియా రేజర్ బ్లేడ్లు, కాటన్ స్వాబ్స్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు దొంగతనం చేసిన వ్యక్తి వివరాలను రెస్టారెంట్ వాళ్లు తెలియజేశారు. బుధవారం సాయంత్రం.. మార్క్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతనిపై బెదిరించి దొంగతనానికి పాల్పడిన కేసు నమోదు చేశారు. ఆయుధంతో పాటు డ్రగ్స్ తో దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు నమోదయ్యాయి. జైలుకు పంపించారు.