రూ.2వేలకు 50 గుడ్లు పందెం: 41వ గుడ్డుకే ప్రాణం వదిలాడు

పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. తన గురించి తానే అతిగా ఊహించుకుని కట్టుకున్న వాళ్లను, కడుపున పుట్టిన వాళ్లని అనాథలుగా మిగిల్చాడు. 50కోడి గుడ్లు తింటానని పందెం కట్టి 42వ గుడ్డు దగ్గర ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జైన్‌పూర్‌లోని బీబీగంజ్ బజార్‌లో చోటు చేసుకుంది. సుభాష్ యాదవ్ అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. నలుగురు కూతుళ్లు పుట్టినా కొడుకు కావాలనే ఆశతో రెండో వివాహం చేసుకున్నాడు. 

రూ.2వేలకు బెట్ కట్టి 50కోడి గుడ్లు తింటానని స్నేహితుల ముందు అనుకుంటున్నాడు. ఫుల్ బాటిల్ మద్యం తాగిన సుభాష్.. 41 గుడ్లు మింగేశాడు. 42వ గుడ్డు నోట్లో పెట్టుకుని స్పృహ తప్పిపోయాడు. వెంటనే గమనించిన స్నేహితులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తామేం చేయలేమని చేతులెత్తేశారు. లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా కొద్ది గంటల క్రితమే చనిపోయినట్లు ధ్రువీకరించారు. 

సుభాష్.. అతిగా తినడం వల్లనే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.