హై టెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య!

  • Publish Date - April 25, 2019 / 10:09 AM IST

బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆగి ఉన్న రైలు పైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన ఆ వ్యక్తి నేరుగా ఆగి ఉన్న ట్రైయిన్‌పైకి ఎక్కి కరెంట్‌ తీగలను పట్టుకుంటున్నానని గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడున్న స్థానికులు, రైల్వే సిబ్బంది అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్‌ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను విద్యుత్ తీగల్ని పట్టుకోగానే షాక్‌తో కిందపడిపోయాడు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్‌కు వచ్చి అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి.. మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇదంతా అక్కడ ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఇప్పుడా వీడియో వైరల్‌ అయింది.