విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహరచన

 విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.

  • Publish Date - April 11, 2019 / 12:21 PM IST

 విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.

 విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు. చీకుపనస మద్దిగరువు దగ్గర అత్యంత శక్తివంతమైన మూడు మందుపాతరలను అమర్చారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఏపీలో ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతో పెను మును తప్పింది. 

అయితే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించారు. కొంతకాలంగా ఎన్నికలను బహిష్కరిస్తునట్లు పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. బేసిక్ గా మావోయిస్టులు ఎన్నికల వ్యవస్థను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వ్యతిరేకిస్తున్నారు.    
Read Also : తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ