Keesara Police: గే లే వారి టార్గెట్.. యాప్ ద్వారా గాలం.. కక్కుర్తి పడ్డారో ఖతమే
సోషల్ మీడియాలోని ప్రైవేట్ యాప్స్ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
- Naveen
- Published On : April 11, 2026 / 08:07 PM IST
Keesara Police: మేడ్చల్ జిల్లా కీసరలో డెకాయిటీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 మంది డెకాయిటీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 115 గ్రాముల బంగారం, షిఫ్ట్ డిజైర్ కారు, స్కూటీ, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ బాధితుడిపై దాడి చేసి దోపిడీకి పాల్పడింది గ్యాంగ్. ఏడుగురు నిందితుల్లో ఒకడు పరార్ అయ్యారు. నిందితులను వరంగల్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్, కీసర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసినట్లు గుర్తించారు.
Grinder అనే యాప్ ద్వారా నిందితులు పరిచయం అయ్యారు. గే వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు. బాధితుల వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలోని ప్రైవేట్ యాప్స్ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఏ యాప్ పడితే ఆ యాప్ లో పర్సనల్ డీటైల్స్ ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Also Read: మంగ్లీపై కేసు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు.. సెంట్రల్ మినిస్టర్ పేరుతో..
