Ghatkesar SWE Dead body
Telangana : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి కొత్త నరేష్ మృతదేహం లభ్యమయ్యింది. గ్రామంలోని మంగళకుంట చెరువు దగ్గర నిన్న నరేష్ ద్విచక్ర వాహనం, చెప్పులు గుర్తించిన కుటుంబ సభ్యులు, పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చెరువు లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు చెరువులో నుంచి నరేష్ మృతదేహన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు.
Also Read : Telangana Rains : రేపు, ఎల్లుండి తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు
నరేష్ కు వివాహం అయ్యి కేవలం రెండు వారాలు అయ్యింది. గత నెల 26న కోకాపేటకు చెందిన యువతితో నరేష్ వివాహం జరిగింది. నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా….లేక మరేదైనా కారణం అయి ఉంటుందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.