Mogali Rekulu Serial
Mogali Rekulu : నా భర్తకు అమ్మాయిల పిచ్చి అంటూ మొగలి రేకులు సీరియల్ నటుడు దయ బాగోతాన్ని అతని భార్య బయటపెట్టింది. తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ సీరియల్స్ లో ఒకటైన మొగలి రేకులులో దయ పాత్రలోనటిస్తున్న నటుడు పవిత్రనాథ్ బాగోతాన్ని అతని భార్య వివరించింది.
దయ పాత్రలో నటించి అభిమానుల ఆదరణ చూరగొన్న పవిత్రనాథ్ నిజజీవితంలో పెద్ద విలన్ అని ఆమె వివరించింది. ఓ యూట్యూబ్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో దయ విలనిజం గురించి ఆమె పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. పవిత్రనాథ్ తో తనకు 2009 లో పెళ్లి జరిగిందని.. అప్పటికే అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిపింది.
Also Read : Tirumala Special Darshanam : వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం పునరుధ్దరించ లేదు
జాతకాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చి వారితో గ డిపేవాడని తెలిపింది. అదేంటని ప్రశ్నిస్తే తనపై పలు మార్లు చేయిచేసుకుని కొట్టాడని వివరించింది. ఒకమ్మాయితో దాదాపు 8 ఏళ్లపాటు ఎఫైర్ నడిపించి తనను మోసం చేశాడన్నది. రోజు ఇంటికి తాగొచ్చి టార్చర్ పెట్టేవాడని…తాను ఏ సీరియల్స్ లో పని చేస్తున్నాడో ఓఒక్కరోజు నాకు చెప్పలేదని ఆమె తెలిపింది.
Mogali Rekulu Daya
పెళ్లైన 10 ఏళ్ల నుంచి నరకం చూపిస్తున్నాడని… ఈ విషయం అత్తమామలకు చెపితే వారు నన్ను ఇంట్లోంచి గెంటేశారని వాపోయింది. అతను ఇతర మహిళలతో తిరుగుతున్నప్పడు నాకు విడాకులు ఇవ్వోచ్చుగా అంటే, విడాకులు సైతం ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని…. తన లాంటి కష్టం మరోక మహిళకు రాకూడదని…తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని ఆమె కోరింది. పవిత్రనాథ్ ప్రస్తుతం కృష్ణతులసి అనే సీరియల్ లో మల్లికార్జున్ అనే పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు.