Tirumala Special Darshanam : వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పునరుధ్దరించ లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి  వచ్చే  వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పధకాన్ని పున‌రుద్ధ‌రించ‌లేదని టీటీటీ బోర్టు తెలిపింది.

Tirumala Special Darshanam : వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పునరుధ్దరించ లేదు

Tirumala Old Age People

Tirumala Special Darshanam :  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి  వచ్చే  వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పధకాన్ని పున‌రుద్ధ‌రించ‌లేదని టీటీటీ బోర్టు తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోంది.

కాగా గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు ఒక తప్పు సమాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజ‌మ‌ని న‌మ్మి తిరుపతికి వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది.

Also Read : No Permission For Girivalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు అనుమతి లేదు

భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరుతోంది.