Jain Monk Molesting : యువతిని వేధించిన కేసులో జైన సన్యాసి ఆత్మహత్య

ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలోని జైన మందిరంలో 19 ఏళ్ల యువతిని వేధించిన 70 ఏళ్ల జైన సన్యాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Jain Monk Molesting

Jain Monk Molesting : ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలోని జైన మందిరంలో 19 ఏళ్ల యువతిని వేధించిన 70 ఏళ్ల జైన సన్యాసి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఘట్ కోపర్ ఈస్ట్ ప్రాంతంలోని జైన మందిరంలో ఉండే సన్యాసి మన్హార్ దేశాయ్ 2012 లో ఓ 19ఏళ్ల యువతిని లైంగికంగా వేధించాడు.

ఈకేసులో  విచారణ చేపట్టిన పోలీసులు కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టారు.  నేరం రుజువు కావటంతో సెషన్స్ కోర్టు మే నెల మొదటి వారంలో దేశాయ్ కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కరోన మహమ్మారి కారణంగా కోర్టు ఆదేశాలు అమలు చేయటంలో జాప్యం జరగటం వల్ల అతడ్ని అరెస్ట్ చేయటం ఆలస్యం అయ్యింది.

ఈ నేపధ్యంలో మే 20 వ తేదీ ఘట్ కోపర్ జైన దేవాలయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని మునిదేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేవాలయంలో పని చేస్తున్నకార్మికుడు దేశాయ్ అత్మహత్య చేసుకున్న విషయాన్ని చూసి అతడ్ని సీలింగ్ ఫ్యాన్ నుంచి దించి  సమీపంలోని రాజవాడి ఆస్పత్రికి తరలించాడు.

అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పంత్ నగర్ పోలీసులు ఘటనా స్ధలానికి  వచ్చారు. అక్కడ వారు  ఒక సూసైడ్ నోట్  స్వాధీనం చేసుకున్నారు. మరణానంతర జీవితంలో తనతో చేరేందుకు గురువు ప్రపంచాన్ని త్యాగం చేయమని కోరారని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దేశాయ్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.