Mumbai : Porn movies racket, police lodge second FIR; total nine arrested so far : పోర్న్ వీడియోల్లో నటించమని బలవంతం చేసారని మరో మహిళ ఫిర్యాదు చేయటంతో ముంబై లోని మల్వానీ పోలీసుస్టేషన్ లో పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గతవారం మలాద్ లోని మాద్ ప్రాంతంలో పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తున్న ఒక బంగ్లాపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం తాజాగా మరో ఎఫ్ఐర్ నమోదు చేసి మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
గతంలో అరెస్ట చేసిన వారిలో మోడల్, సినీనటి గెహ్నా వశిష్ట్ కూడా ఉన్నారు. గతంలో అరెస్ట్ చేసిన యాస్మిన్ ఖాన్ తో సహా మరో ముగ్గురు పేర్లు రెండవ ఎఫ్ఐఆర్ లో చేర్చారు మల్వానీ పోలీసులు. మొదటి కేసులో భాగంగా దీపాంకర్ ఖాసాన్విస్ అలియాస్ శ్యామ్ బెనర్జీని(36) పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పోర్న్ సైట్లలో అశ్లీల వీడియోలు షూటింగ్ చేసి, అప్ లోడ్ చేసిన కేసులో దీపాంకర్ ఖాసాన్విస్ కూడా భాగస్వామి అని తెలిపారు. జౌత్సాహిక నటీ నటులను, డబ్బు అవసరం అయిన కళాకారులను గుర్తించి వారిని అశ్లీల చిత్రాల్లో నటించమని ప్రలోభాలకు గురిచేస్తున్న రాకెట్ పై గత శుక్రవారం పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో నిర్మాత, దర్శకుడుగా చెప్పబడుతున్న ఖాన్, యూకే కు చెందిన ప్రోడక్షన్ హౌస్ ప్రతినిధి, నటి, మోడల్, గెహ్నా వశిష్ట్, ఉమేష్ కామత్ లు కూడా ఉన్నారు.
పోర్న్ చిత్రాలు అప్ లోడ్ చేసి గెహ్నా వశిష్ట్ గత రెండేళ్లలో రూ.36లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది, మంగళవారం మరో మహిళ ఫిర్యాదుతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రెండవ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ..గుజరాత్, సూరత్ కు చెందిన 40 ఏళ్ల మరో నిందితుడిని కూడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
కాగా గెహనా వశిష్ట్ ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఉబ్బసం, గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారని ఆమెతరుఫు లాయర్ పోలీసు అధికారులను కోరారు. 2019లో ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చారని , ఆమె షుగర్ వ్యాధితో కూడా బాధ పడుతున్నారని తెలిపారు. గెహనా వశిష్ట్ పోర్న్ వీడియోలలో నటించలేదని ఆమె దర్శకుడి సృజనాత్మకత లో భాగంగా మాత్రమే నటించిందని అతని తరుఫులాయర్ వాదించాడు.
గెహ్నా వశిష్ట్ ALT బాలాజీ వెబ్ సిరీస్ లోని గాండీ బాత్ లో బాగా పాపులర్ అయ్యింది. స్టార్ ప్లస్ షో బెహనిన్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. లక్నోయి ఇష్క్, దాల్ మెయిన్ కుచ్ కాలా హై వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించింది. గత వారం జరిపిన దాడిలో పోలీసులు రూ. 5,68 లక్షళ విలువైన ఆరు మొబైల్ ఫోన్లు , ల్యాప్ టాప్ కెమెరాలు, మెమరీ కార్డులు, ఇతర షూటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.