దుబాయ్ లో ఒక భారతీయ పూజారి నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ సుధీర్ ప్రభాకర్ ను అరెస్టు చేసారు. పూజారి ఒక రాజకుటుంబ సభ్యుడ్ని మోసం చేశారన్న ఆరోపణలతో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మహంత్ దాస్ బెయిల్ కోసం సహకరించినట్టు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రకటించింది. సుధీర్ దాస్ బెయిల్‌పై బయటకు వచ్చినా ఆయన పాస్‌పోర్టును మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : ఆ నలుగురు ఎవరు : TRS సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ ?
కానీ, తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానని, ప్రస్తుతం షార్జాలో ఉన్నానని నాసిక్‌లోని తన సన్నిహితులకు పూజారీ చెప్పడం విశేషం. అర్చకుడి వ్యవహారంలో సహాయం చేయాలని విదేశాంగ శాఖకు నాసిక్ MP హేమంత్ గొదాసే, MLA హరీశ్చంద్ర చవాన్‌లు లేఖ రాశారు. దుబాయ్ అధికారులతో మాట్లాడి సుధీర్ పాస్‌పోర్ట్ ఇప్పించడానికి చర్యలు తీసుకుని, స్వదేశాని వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవలే ముంబయి నుంచి దుబాయ్‌కు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన సుధీర్ దాస్, అక్కడ పలు సంస్థలను ప్రారంభించినట్టు సమాచారం. అల్ బూమ్ మెరైన్ లాజిస్టిక్, సరాహా విజన్ ఇన్వెస్టిమెంట్, నాజ్ జనరల్ ట్రేడింగ్ సంస్థలను నడుపుతున్నారు. ఇందులో భాగంగా దుబాయ్‌కు వెళ్లిన ఆయనను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. దుబాయ్ రాజకుటుంబం పేరు వాడుకుని రూ.50 లక్షల వరకు అక్రమంగా కొట్టేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : టీడీపీ నాకు అన్యాయం చేసింది: వైసీపీలో చేరిన తోట దంపతులు