Massive Robbery: వామ్మో.. నగల దుకాణంలో భారీ చోరీ.. 90 సెకన్లలో రూ.17 కోట్ల విలువైన జువెలరీ అపహరణ.. వీడియో చూస్తే వణుకే..

నలుగురు అనుమానితులు హూడీలు ధరించి దుకాణంలోకి చొరబడ్డారు. డిస్ ప్లే కేసులను సుత్తులతో పగలగొట్టారు. విలువైన వస్తువులను నల్లటి..

Massive Robbery: వామ్మో.. నగల దుకాణంలో భారీ చోరీ.. 90 సెకన్లలో రూ.17 కోట్ల విలువైన జువెలరీ అపహరణ.. వీడియో చూస్తే వణుకే..

Updated On : August 18, 2025 / 1:49 AM IST

Massive Robbery: ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. పట్టపగలే భారీ చోరీ చేశారు. ఇది అలాంటి ఇలాంటి దొంగతనం కాదు. కేవలం 90 సెకన్లలో 17 కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లిపోయారు.

ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. వారి దగ్గర ఎలాంటి మారణాయుధాలు (గన్ లు, కత్తులు వంటివి) కూడా లేవు. రెప్పపాటులో విలువైన వస్తువులు దోచుకుని పారిపోయారు. ఆ దొంగలు 50 డాలర్ల ఖరీదు చేసే స్ప్రే ఒకటి, 2 డాలర్ల ఖరీదు చేసే ట్రాష్ బ్యాగులు వెంట తెచ్చుకున్నారు. వాటితోనే భారీ చోరీకి పాల్పడ్డారు.

పశ్చిమ సియాటిల్‌లోని మెనాషే అండ్ సన్స్ జ్యువెలర్స్‌లో ఈ భారీ చోరీ జరిగింది. విలువైన వజ్రాలు, లగ్జరీ గడియారాలు, బంగారం, ఇతర ఆభరణాలను అపహరించుకుపోయారు దొంగలు.

విలువైన వజ్రాలు, లగ్జరీ గడియారాలు, బంగారం, ఇతర ఆభరణాలను అపహరించుకుపోయారు దొంగలు.

చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు లోనికి ప్రవేశించారు. ఆ నలుగురు ఎవరికి దొరికింది వారు దోచుకున్నారు.

రోలెక్స్ గడియారాలు, నెక్లెస్ లు పట్టుకుపోయారు. దోపిడీ సమయంలో, ముసుగు ధరించిన అనుమానితుడు ఉద్యోగులను బేర్ స్ప్రే టేజర్‌తో బెదిరించాడు.

పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దొంగలు పారిపోయారు.

నలుగురు అనుమానితులు హూడీలు ధరించి దుకాణంలోకి చొరబడ్డారు. డిస్ ప్లే కేసులను సుత్తులతో పగలగొట్టారు. విలువైన వస్తువులను నల్లటి సంచుల్లో నింపుకున్నారు.

ఈ భారీ చోరీ స్థానికంగా సంచలనం రేపింది. సెకన్ల వ్యవధిలో ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లిపోవడం కలకలం సృష్టించింది. భారీ చోరీతో జువెలరీ షాప్ యజమాని షాక్ లో ఉన్నారు.

కొన్ని రోజుల పాటు షాప్ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

 

Also Read: వామ్మో.. స్పీకర్స్‌లో 2కిలోల పేలుడు పదార్ధాలు నింపి పెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చాడు.. పెళ్లి కొడుకు మర్డర్‌కు ఖతర్నాక్ ప్లాన్..