మోడల్ రేప్ కేసులో ఊహించని ట్విస్ట్

హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మోడల్ అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసమే యువతి నాటకాలు ఆడుతోందని అత్యాచార ఆరోపణలు

  • Publish Date - January 11, 2020 / 07:50 AM IST

హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మోడల్ అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసమే యువతి నాటకాలు ఆడుతోందని అత్యాచార ఆరోపణలు

హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మోడల్ అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసమే యువతి నాటకాలు ఆడుతోందని అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల పేరెంట్స్ చెబుతున్నారు. నిందితుల పేరెంట్స్ 10టీవీతో మాట్లాడారు. తమ పిల్లలు ఏ తప్పూ చేయలేదన్నారు. యువతి కావాలని తమ పిల్లలను కేసులో ఇరికించిందన్నారు. యువతి కుటుంసభ్యులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. నిఖిల్ తో సహజీవనం చేస్తానని యువతి అంటోందని తెలిపారు. వారి పెళ్లికి తాము అంగీకారం తెలిపామన్నారు. అంతలోనే మరో యువకుడితో ప్రేమ వ్యవహారం ఎలా నడిపిందని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు.

ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మైనర్. బాధితురాలు ఒకలా, నిందితుల పేరెంట్స్ మరోలా చెబుతుండటంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. త్వరలోనే ఈ కేసులోని మిస్టరీని చేధిస్తామన్నారు. సెల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

దిశ హత్యాచారంపై దేశమంతటా చర్చ జరిగినా.. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా..అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ రేపిస్టులను త్వరలోనే ఉరితీయబోతున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తెలంగాణ మిస్‌ మోడల్‌కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారు. తనకు బలవంతంగా మద్యం తాగించి దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా అత్యాచారాన్ని సెల్‌ ఫోన్‌లో వీడియో తీశారంది. 2019 డిసెంబర్ 28న జూబ్లిహిల్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 28నే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను అంది. పోలీసులు మాత్రం జనవరి 7న ఫిర్యాదు నమోదు చేశారని తెలిపింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను మీడియాను ఆశ్రయించినట్టు వివరించింది. పోలీసులు ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.