Durga Temple : దుర్గగుడిపై పుట్టినరోజు వేడుకలు.. 9మంది సిబ్బందిపై వేటు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై బర్త్ డే పార్టీ చేసుకోవటం కలకలం రేపింది. దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.
- chvmurthy
- Published On : March 27, 2022 / 01:39 PM IST
Vijayawada Durga Gudi
Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై బర్త్ డే పార్టీ చేసుకోవటం కలకలం రేపింది. దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఈ విషయం ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కొండపై పార్టీ చేసుకున్న ఏడుగురు శానిటరీ సిబ్బందిని విధులనుంచి తొలగించారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుతో సహా, ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకున్నారు.
శానిటేషన్ సూపర్ వైజర్ బర్త్ డే సందర్భంగా గత బుధవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో అవుట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్తడే పార్టీ చేశారు.
మరునాడు ఈ సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో బ్రమరాంబ కొంత మంది సిబ్బందిని నియమించి జరిగిన ఘటనపై విచారణ జరిపించారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బర్త్ డే పార్టీతో పాటు కొందరు మద్యం సేవించినట్లు తెలియటంతో ఈవో దృష్టి సారించి ప్రాధమిక విచారణ జరిపి చర్యలు చేపట్టారు.
Also Read : Mee Too : ఇప్పటికి 10మంది మహిళలతో శారీరక సంబంధం ఉంది.. అదే “మీటూ” అయితే కొనసాగిస్తా
సాధారణంగా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆలయంలో ఎవరూ ఉండరు. సెక్యూరిటీ సిబ్బంది శానిటరీ సిబ్బంది మాత్రమే ఉంటారు. దీంతో వారు ఇష్టానురీతిగా వ్యవహరించినట్లు తెలిసింది. విధుల నుంచి తొలగించిన వారిలో ఏడుగురు శానిటరీ సిబ్బంది,ఒక అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
