ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. టిక్ టాక్ పరాయి వ్యక్తితో పరిచయం చివరికి మహిళ ప్రాణం తీసింది.
టిక్ టాక్ కలిపింది ఇద్దరిని:
నోయిడాలో నివాసం ఉంటే ఓ మహిళ తన అపార్టుమెంటులో హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు బిసారక్ లో నివాసం ఉంటుంది. గురువారం(మార్చి 5,2020) రాత్రి ఆమె కొడుకు ఇంటికి వచ్చాడు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఎన్నిసార్లు బెల్ కొట్టినా డోర్ తియ్యలేదు. ఎలాగో లోపలికి ప్రవేశించిన అతడు.. తల్లి మృతదేహం చూసి షాక్ అయ్యాడు. ఆమె ముఖం మీద గాయాలు ఉన్నాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డబ్బు కోసం హత్య:
ఈ కేసుని పోలీసులు 6 గంటల్లో చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు రాఘవ కుమార్. ఢిల్లీ వాసి. టిక్ టాక్ లో మహిళకు, రాఘవకు పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఒకరికొకరు తెలుసు. టిక్ టాక్ లో ఇద్దరూ యాక్టివ్ గా ఉండేవారు. వీడియోలు షేర్ చేసుకునే వారు. క్రమంగా స్నేహం బలపడింది. ఇద్దరూ దగ్గరయ్యారు. రాఘవ మహిళ ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మహిళ ఇంటికి వచ్చిన రాఘవ.. డబ్బు కోసం గొడవ పడ్డాడు. ఆవేశంతో ఆమెను మర్డర్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి లాక్ వేసి వెళ్లిపోయాడు. మహిళ ఫోన్, ఇంటి తాళం తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఇంటి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హత్య చేసింది తానే అని, డబ్బు కోసమే చంపేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో పరాయి వ్యక్తులతో పరిచయాలు మంచివి కాదని పోలీసులు చెప్పారు. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలు, మహిళలను హెచ్చరించారు. గుర్తు తెలియన వ్యక్తులతో స్నేహం ప్రాణానికే ప్రమాదం అన్నారు.
See Also | తాజ్‌మహల్‌ను మూసేయాలంటూ కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ