ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు మృతి

  • Publish Date - May 8, 2019 / 01:43 PM IST

కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లాడు. 15 రోజులుగా ధాన్యం అమ్మేందుకు ఎండలో పడిగాపులు కాసాడు. వడదెబ్బతో ధాన్యం కుప్పపైనే రైతు మృతి చెందాడు. 

ఇంటి పెద్ద మృతితో రైతు కుటుంబం రోడ్డున పడింది. మృతునికి ముగ్గురు పిల్లలు కాగా నెల రోజుల క్రితమే అప్పుచేసి ఆడపిల్లకు పెళ్లి చేశాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధాన్యం కొనుగోలులో అధికారుల జాప్యానికి రైతు బలయ్యాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.