మంటల్లో చిక్కుకుని రైతు మృతి

  • Publish Date - May 15, 2019 / 12:23 PM IST

జగిత్యాల: జగిత్యాల జిల్లా  కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని ఎల్లయ్య అనే రైతు మృతి చెందాడు. రోజు వారీగా చేను వద్దకు వెళ్లిన ఎల్లయ్య అకస్మాత్తుగా తన చేనుకు మంటలు అంటుకున్నట్లు చూశాడు. వాటిని ఆర్పేయత్నంలో మంటలు ఎల్లయ్య చుట్టు పక్కల వ్యాపించాయి.  అదే సమయంలో గాలి బాగా వీచటంతో వాటిలోంచి బయటకు రాలేని ఎల్లయ్యకు మంటలు అంటుకుని మరణించాడు.

వృధ్దుడైన ఎల్లయ్య ఆ మంటల నుంచి బయటకు రాలేక పోవటంతో మంటల్లో చిక్కుకుని మరణించటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చుట్టుపక్కల రైతులు ఘటనా స్ధలం వద్దకు వచ్చేసరికే ఎల్లయ్య తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.