Ghaziabad: పార్కింగ్ విషయంలో గొడవ.. తలపై ఇటుకతో కొట్టి వ్యక్తి హత్య.. వీడియోలో రికార్డైన ఘటన
కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఒక వ్యక్తి, మరో వ్యక్తి తలపై ఇటుకతో దాడి చేసి కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
- Narender Thiru
- Published On : October 26, 2022 / 03:59 PM IST
Ghaziabad: ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన మంగళవారం రాత్రి, ఘజియాబాద్‌లో జరిగింది. ఒక హోటల్ వద్దకు వరుణ్ (35) అనే వ్యక్తి తన కారులో వచ్చాడు.
WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే
రోడ్డు పక్కన కారు పార్కింగ్ చేసి, హోటల్ దగ్గరికి వెళ్లాడు. వరుణ్ పార్కు చేసిన కారు పక్కనే మరో వ్యక్తి కారు పార్కు చేశాడు. అయితే, ఆ కారు డోర్ తీయడం అతడికి సాధ్యం కాలేదు. దీంతో వరుణ్ కారును పక్కకు జరపమని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. తర్వాత ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో రెండో వ్యక్తి వరుణ్‌పై దాడి చేశాడు. దీంతో గాయపడ్డ వరుణ్ కింద పడిపోయాడు. అయితే, అతడు అంతటితో వదలలేదు. దూరంగా ఉన్న ఇటుక తీసుకొచ్చి, కింద పడిపోయిన వరుణ్ తలపై బలంగా విసిరికొట్టాడు. దీంతో వరుణ్ తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే కొందరు అప్రమత్తమై వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు.
Delhi: ఢిల్లీలో కొత్త రూల్.. రెడ్ సిగ్నల్ పడిందా.. ఇంజిన్ ఆఫ్ చేయాల్సిందే!
కానీ, అప్పటికే వరుణ్ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని అక్కడ వాహనంలో వెళ్తున్న వారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Ghaziabad ढाबे पर गाड़ी पार्क करने को लेकर हुए विवाद के रिटायर्ड दरोगा के बेटे के सिर पर ईंट मारकर हत्या कर दी गयी, घटना टीलामोड थाना क्षेत्र का है।घटना की लाइव वीडियो वायरल @ghaziabadpolice @SspGhaziabad pic.twitter.com/RH0PmLGxru
— Suman Chaudhary (@SumanCh22775734) October 26, 2022
