Delhi: ఢిల్లీలో కొత్త రూల్.. రెడ్ సిగ్నల్ పడిందా.. ఇంజిన్ ఆఫ్ చేయాల్సిందే!

ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్’ అనే కొత్త ప్రచారం ప్రారంభించింది. దీని ప్రకారం సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే బండి ఇంజిన్ ఆఫ్ చేయాలి.

Delhi: ఢిల్లీలో కొత్త రూల్.. రెడ్ సిగ్నల్ పడిందా.. ఇంజిన్ ఆఫ్ చేయాల్సిందే!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో వాహనాలకు సంబంధించి సరి-బేసి విధానం తీసుకొచ్చింది.

Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని వ్యాఖ్య

దీని ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ సరిసంఖ్య ఉన్నవి ఒక రోజు, బేసి సంఖ్య ఉన్నవి మరో రోజు నడవాల్సి ఉంటుంది. అలాగే దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. తాజాగా మరికొన్ని నిబంధనల్ని రూపొందించింది. ఢిల్లీ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 15 అంశాల ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్’ అనే పేరుతో కొత్త ప్రచారం ప్రారంభించింది. అంటే ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే, వెంటనే బండి ఇంజిన్ ఆఫ్ చేయాలి. కారు, బైకు, ఆటో.. ఏ వాహనమైనా సరే రెడ్ లైట్ పడగానే ఇంజిన్ ఆఫ్ చేయాలి. గ్రీన్ లైట్ పడబోయే ముందు వరకు ఇంజిన్ ఆఫ్ చేయాలి.

Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

ఇలా ఢిల్లీలోని ప్రతి సిగ్నల్ దగ్గర.. మూడు వైపులా వాహనాల ఇంజిన్లు ఆపేయడం వల్ల 15-20 శాతం వాయు కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ రూల్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. సిగ్నల్స్ దగ్గర కొందరు వాలంటీర్లు వాహనదారులకు గులాబి పూలు ఇచ్చి, వాహనాలు ఆపేయాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. దాదాపు 2,500 మంది వరకు వాలంటీర్లు ఈ విషయంలో పని చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని పలు సిగ్నల్స్ దగ్గర వీళ్లంతా పని చేస్తున్నారు.