Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని వ్యాఖ్య

కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నాగోల్ ఫ్లైఓవర్‌ను నిర్మించారని చెప్పారు. ఎల్బీ నగర్ ఉప్పల్ మధ్య ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు తగ్గట్లుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ.143 కోట్లతో నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేశామని, వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని వ్యాఖ్య

Nagole Flyover: హైదరాబాద్ శివారులోని నాగోల్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. దీన్ని రూ.143 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఎల్బీనగర్-నాగోల్-ఉప్పల్ మధ్య ట్రాఫిక్ తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ద్వారా జీహెచ్‌ఎంసీ ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. ఇది 990 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తవడంతో ఎస్​ఆర్​డీపీ ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల్లో 16వ ఫ్లైఓవర్ పూర్తయినట్లయింది. త్వరలోనే హైదరాబాద్ లోని కొత్తగూడ, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్లు కూడా పూర్తి కానున్నాయి.

నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నాగోల్ ఫ్లైఓవర్‌ను నిర్మించారని చెప్పారు. ఎల్బీ నగర్ ఉప్పల్ మధ్య ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు తగ్గట్లుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ.143 కోట్లతో నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేశామని, వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

ప్రణాళికలు వేసుకుని అభివృద్ధి చేసుకోకపోతే బెంగళూరుకు వచ్చిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్ చౌరస్తా వద్ద చాలా ట్రాఫిక్ తో గందరగోళ పరిస్థితులు ఉండేవని చెప్పారు. అక్కడ చేపట్టిన పనుల వల్ల ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవని అన్నారు. హైదరాబాద్ లో 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు.  ఎల్బీనగర్ లో మంచి నీటి సమస్యకు కూడా పరిష్కారం చూపుతామని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..