WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

మంగళవారం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలు ఆగిపోయేందుకు గల కారణాన్ని వెల్లడించింది.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

WhatsApp: ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో అక్టోబర్ 25, మంగళవారం మధ్యాహ్నం.. దాదాపు రెండు గంటలపాటు వాట్సాప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 02.20 గంటల వరకు వాట్సాప్ పని చేయలేదు.

Delhi: ఢిల్లీలో కొత్త రూల్.. రెడ్ సిగ్నల్ పడిందా.. ఇంజిన్ ఆఫ్ చేయాల్సిందే!

దీంతో స్పందించిన కంపెనీ, త్వరితగతిన చర్యలు తీసుకుని సేవలు పునరుద్ధరించింది. అయితే, వాట్సాప్ ఎందుకు నిలిచిపోయింది అనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ కంపెనీ ఒక ప్రకటన చేసింది. తమ వైపు నుంచే సమస్య తలెత్తినట్లు తెలిపింది. ‘‘మా వైపు తలెత్తిన ఒక సాంకేతిక సమస్య వల్లే వాట్సాప్ నిలిచిపోయింది’’ అని కంపెనీ ప్రకటించింది. ఈ సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కారమైనట్లు చెప్పింది. అయితే, ఆ సమస్య ఏంటనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు.

Rishi Sunak: రవి అస్తమించని దేశానికి తొలి హిందూ ప్రధానమంత్రి.. 10 సంగతులు

గత ఆరేళ్లుగా ప్రతి అక్టోబర్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతూనే ఉన్నాయి. డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్) సంబంధిత సమస్య వల్లే ఈ పరిస్థితి వస్తున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. ఈసారి కూడా ఇదే తరహా సమస్య తలెత్తినట్లు కంపెనీ భావిస్తోంది. కాగా, వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’కు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి కంపెనీలు ఉన్నా వాటి సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వాట్సాప్ మాత్రమే ఇలా నిలిచిపోతోంది.