Rishi Sunak: రవి అస్తమించని దేశానికి తొలి హిందూ ప్రధానమంత్రి.. 10 సంగతులు

బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనా రిషి సునాక్.. రవి అస్తమించని రాజ్యంలో తొలి హిందూ ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేతిలో ఓడినప్పటికీ.. కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం కలిసి వచ్చింది. దీంతో ఏకగ్రీవంగా ఆయనను సోమవారం ప్రధానిగా ఎన్నుకున్నారు. అనంతరం సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా కింగ్ చార్లెస్ III మంగళవారం నియమించారు

Rishi Sunak: రవి అస్తమించని దేశానికి తొలి హిందూ ప్రధానమంత్రి.. 10 సంగతులు

I will place economic stability & confidence says Rishi sunak in his first speech after became pm

Rishi Sunak: బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనా రిషి సునాక్.. రవి అస్తమించని రాజ్యంలో తొలి హిందూ ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేతిలో ఓడినప్పటికీ.. కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం కలిసి వచ్చింది. దీంతో ఏకగ్రీవంగా ఆయనను సోమవారం ప్రధానిగా ఎన్నుకున్నారు. అనంతరం సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా కింగ్ చార్లెస్ III మంగళవారం నియమించారు. తన తొలి ప్రసంగంలోనే ఆర్థిక సుస్థిరత, ప్రజా విశ్వాసం ఎజెండా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పిన సునాక్ గురించి కొన్ని సంగతులు..

1. యోక్షైన్ నుంచి ఎంపీగా గెలిచిన రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్‭లో భగవత్గీత మీద ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి.
2. సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ భారతీయ మూలాలు ఉన్నవారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరు 1960లో బ్రిటన్‭కు వలస వెళ్లారు.
3. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు.
4. సునాక్ తరచుగా తన వారసత్వం గురించి మాట్లాడుతుంటారు. అతని కుటుంబ విలువలు, సంస్కృతి గురించి తరచుగాప్రస్తావిస్తారు.
5. స్టాన్‭ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ చేసిన సునాక్.. ఇన్వెస్ట్‭మెంట్ బ్యాంకర్‭గా పని చేశారు.
6. తన అత్తామామలను కలవడానికి సునాక్ తరుచూ బెంగళూరు వస్తుంటారు.
7. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రధాని ఎన్నికల్లో తన విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన సూట్లపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
8. రిషి సునాక్ నికర ఆస్తుల విలువ 700 మిలియన్ పౌండ్లు. ఇవే కాకుండా యూకేలో చాలా ఆస్తులు ఉన్నాయి.
9. ఒత్తిడి పెరిగిన సమయంలో ఆయన భగవత్గీత చదువుతారట.
10. రిషికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ పడుతుంటారు.

Rishi Sunak: రిషి సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III.. తొలి ప్రసంగంలో ఏం చెప్పారంటే..?