Rishi Sunak: రిషి సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III.. తొలి ప్రసంగంలో ఏం చెప్పారంటే..?

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపించే ప్రభుత్వం ఆ వైపుగా పని చేస్తుందని చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.

Rishi Sunak: రిషి సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III.. తొలి ప్రసంగంలో ఏం చెప్పారంటే..?

I will place economic stability & confidence says Rishi sunak in his first speech after became pm

Rishi Sunak: కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆర్థిక స్థిరత్వం, ప్రజా విశ్వాసమని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరంతరం టెన్ డౌనింగ్ స్ట్రీట్‭లో ఆయన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ ప్రభుత్వ విధానాల్ని బ్రిటన్ ప్రజలకు వెల్లడించే ప్రయత్నం చేశారు.

‘‘కోవిడ్ సమయంలో ప్రజలు, వ్యాపారాలను రక్షించడానికి నేను ఎంత చేయగలిగానో మీ అందరికీ తెలుసు. ప్రస్తుత పరిస్థితులేమీ అంత భయంకరంగా అయితే లేవు. ఈ ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక స్థిరత్వం, ప్రజా విశ్వాసం కేంద్రంగా ఉంచుతానని చెప్తున్నాను. అయితే దీని కోసం కొన్ని కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపించే ప్రభుత్వం ఆ వైపుగా పని చేస్తుందని చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తరువాత బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా పేరుగాంచిన 42ఏళ్ల సునాక్ ఆధునిక కాలంలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన నాయకుడిగా మారారు. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో రిషి సునాక్ మూడవ ప్రధాని కావటం విశేషం. కాగా, రిషి సునాక్‭ను బ్రిటన్ ప్రధానిగా కింగ్ చార్లెస్ III మంగళవారం నియమించారు.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ