మద్యం మత్తులో ప్రాణాలు తీసిన పోలీస్‌

ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది.

  • Publish Date - November 16, 2019 / 07:19 AM IST

ప్రజలను రక్షించాల్సిన పోలీసే…. ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది.

ప్రజలను రక్షించాల్సిన పోలీసే…. ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పట్టపగలు పీకలదాకా మద్యం సేవించాడు. అంతటితో ఆగకుండా కారును నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను మద్యం మత్తులో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

అతడి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాలుడిని స్థానికంగా ఉన్న  ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. పోలీసు ఆఫీసర్‌ కారులో మద్యం సీసాలు  కూడా లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.