Bull Attack : ఘోరం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు దాడి, కొమ్ములతో పొడిచి పొడిచి చంపేసింది, వీడియో వైరల్
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన మహేశ్ చంద్ర తన్వర్(62) పై ఎద్దు దాడి చేసింది. తన కొమ్ములతో పదే పదే పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన్వర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
- Naveen
- Updated on- March 16, 2023 / 12:52 AM IST
Bull Attack : మృత్యువు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో కబలిస్తుందో చెప్పలేము. సడెన్ గా మృత్యువు సంభవిస్తుంది. అప్పటివరకు బాగానే ఉన్న వ్యక్తి హఠాత్తుగా విగతజీవిగా మారతాడు. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన ఆ వృద్ధుడిని మృత్యువు ఎద్దు రూపంలో వెంటాడింది. ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు మరణించాడు.
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన మహేశ్ చంద్ర తన్వర్(62) పై ఎద్దు దాడి చేసింది. తన కొమ్ములతో పదే పదే పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన్వర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తన్వర్ తనంతట తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో సడెన్ గా ఓ ఎద్దు కోపంతో తన్వర్ పైకి దూసుకొచ్చింది. తన కొమ్ములతో ఆయనను పొడిచింది. ఈ ఘటనతో తన్వర్ బిత్తరపోయారు. తనను కాపాడాల్సిందిగా కేకలు వేశాడు. ఎద్దు పొడవటంతో ఆయన కిందపడిపోయాడు.
ఎద్దు నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగానే ప్రతిఘటించాడు. దాని కొమ్ములు పట్టుకున్నాడు. అయినా ఎద్దు ఊరుకోలేదు. కొమ్ములతో కసిగా పొడిచింది. ఇంతలో అటుగా బైక్ మీద వచ్చిన ఓ వ్యక్తి రాయి తీసుకుని ఎద్దుపై వేశాడు. దాంతో ఎద్దు అక్కడి నుంచి పారిపోయింది. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. కొమ్ములతో పొడవటంతో.. తీవ్ర గాయాలు అవడంతో వృద్ధుడు కన్నుమూశాడు.
ఎద్దు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అంతా వామ్మో అంటున్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇక పశువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని అంటున్నారు.
కాగా నగరంలో పశువులు విచ్చల విడిగా తిరుగుతున్నాయని, పశువుల దాడిలో పలువురు వాహనదారులు, పాదచారులు గాయపడుతున్నారని స్థానికులు వాపోయారు.
#Rajasthan#Bull
सांड के हमले में बुजुर्ग के चेहरे से आरपार हुआ सींग pic.twitter.com/fZLXATOsk7— Sweta Gupta (@swetaguptag) December 20, 2022
