Married Woman Audio Viral : రేపు ఉదయాన్ని చూస్తానో లేదో.. మహిళ ఆడియో కలకలం

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింటి వారి వేధింపులు తప్పలేదు. భర్త, అత్తమామలకే సపోర్టు చేస్తూ మాట్లాడాడు.

Married Woman Audio Viral

Married Woman Audio Viral : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింటి వారి వేధింపులు తప్పలేదు. భర్త, అత్తమామలకే సపోర్టు చేస్తూ మాట్లాడాడు. అత్త,మామలు పెట్టే హింస భరించలేని ఇల్లాలు తాను అనుభవిస్తున్న కష్టాలను సోదరుడితో మొర పెట్టుకుంది. అనూహ్య రీతిలో అత్తగారింట్లో ఆదివారం శవమై తేలింది. అ్తతమామలు పెట్టే కష్టాలను సోదరుడితో మొరపెట్టుకున్న ఆడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

కేరళలోని కన్నూరు జిల్లా పయ్యన్నూరు కు చెందిన సునీషా ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ రాత్రికి తాను బతికి ఉంటానో లేదో…రేపు ఉదయాన్ని చూస్తానో లేదో అనుమానమే….. అంటూ బాధను వ్యక్తం చేస్తూ   సునీషా(26) తన సోదరుడితో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సునీషా ఏడాదిన్నర క్రితం విజేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆగస్టు 29 ఆదివారం నాడు అనుమానాస్పద స్ధితిలో అత్తింట్లో శవమై తేలింది. ఆమె చనిపోవటానికి కొన్ని రోజుల ముందు తన సోదరుడు సుధీష్ తో భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు, తాను పడుతున్న మానసిక  క్షోభ గురించి ఫోన్ లో చెప్పకుంది.  భర్త తీవ్రంగా కొట్టటం…. అత్త జుట్టు పట్టుకు లాగటం వంటి విషయాలను అన్నీ చెప్పుకుంది.

మామ హెల్మెట్ తో తనపై దాడి చేసిన విషయాన్ని కూడా తన సోదరుడికి చెప్పుకుంది. ఈరాత్రికి సజీవంగా ఉంటానో లేదో…నాకే డౌట్ అంటూబాధ పడింది. ఈ ఆడియో ఇపుడు స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. భర్త కొడుతుండగా సునీషా మరో ఆడియో రికార్డు చేసింది. తన అత్త కొడుతున్నపుడు, మామ తనతో అసభ్యంగా ప్రవర్తించినపుడు ఎందుకు మాట్లాడలేదని భర‍్తని ప్రశ్నించడం, అలాగే తనను కొడుతున్న విజువల్స్ కూడా రికార్డ్ చేస్తానని సునీషా భర్తకు చెప్తే.. ఏం చేసుకుంటావో..చేసుకో పో అని విజేష్‌ చెప్పడం లాంటివి ఇందులో రికార్డైనాయి.

దీంతో మొదట సునీషాది ఆత్మహత్యగా భావించినా, అత్తింటి వారే ఆమెను హత్యచేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.