భక్తి ముసుగులో భయానకం : పిల్లులను వేటాడే ముఠా అరెస్ట్

విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు

  • Publish Date - August 27, 2019 / 10:21 AM IST

విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు

విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పిల్లులను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ పిల్లి చనిపోయింది. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ల్యాబ్ కి తరలించారు. మరో పిల్లి పారిపోయింది.

విశాఖ జోడిగుళ్లుపాలెంలో ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. జోగిని యాత్ర పేరుతో టాటా ఏస్ లో తిరుగుతూ అన్ని ఏరియాలను పరిశీలిస్తారు. దేవుడి ఫొటోలు పెట్టుకుని తిరుగుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా భక్తుల్లా వేషాలు వేసుకుంటారు. ఆ గ్యాంగ్ లో ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా తిరిగి పిల్లులను వేటాడి పట్టుకుంటారు. ఇది యానిమల్ కేర్ అండ్ ప్రొటక్షన్ సభ్యుల కంట పడింది. పిల్లులను పట్టుకుని చిత్రహింసలు పెట్టడం వారు గమనించారు. వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఆరిలోవ పోలీసులు ముఠా సభ్యులను పట్టుకున్నారు. కేవలం తినడం కోసమే పిల్లులను చంపుతున్నట్టు వారు అంగీకరించారు.

యానిమాల్ ప్రొటక్షన్ సంస్థ ఫిర్యాదుతో ఆరుగురిపై పోలీసులు కేసు నమెదు చేశారు. వారిని రిమాండ్ కి తరలించారు. గ్యాంగ్ లోని సభ్యులను సైదులు, మంచలరాజు, వీరబాబు, రమణి, మణి, శైలజగా గుర్తించారు. వీరంతా గుంటూరు సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వారు. ఓ చోట స్థిరంగా ఉండరు. ఇలా తిరుగుతూ ఉంటారు. భక్తి పేరుతో చందాలు వసులూ చేస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు.