Kerala: తన వీపుపై పీఎఫ్ఐ ముద్రవేసిందంటూ సంచలనం రేపిన జవాన్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే?

కేరళలోని కొల్లాం జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. జవాను ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం

Kerala Crime News: తనపై దాడి చేయడమే కాకుండా తన వీపుపై బలవంతంగా పీఎఫ్ఐ ముద్ర వేశారంటూ ఫిర్యాదు చేసిన ఆర్మీ జవానును అరెస్ట్ చేశారు. కేరళలోని కొల్లాం జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. జవాను ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. అతడిపై ఎవరూ ఇలాంటి ముద్రలు వేయలేదని తనకు తానే అలా వేసుకున్నట్లు తెలిసింది. ఆ వెంటనే అతడిని కొల్లాం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంతకు ముందు ఏం జరింగిందంటే?
కడక్కల్ లోని తన ఇంటి సమీపంలోని అడవిలోకి కొందరు వ్యక్తులు తనను తీసుకెళ్లి కొట్టారని, తన వీపుపై పెయింట్ తో దేశంలో నిషేధిత సంస్థ అయిన పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) అని ముద్ర వేశారని షైన్ కుమార్ అనే ఒక ఆర్మీ జవాన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 24న జరిగినట్లు ఫిర్యాదులో సదరు జవాను పేర్కొన్నాడు. అయితే ఎందుకు దాడి చేశారనే విషయానని అతడు వెల్లడించలేదు. తనకు ఆ విషయం తెలియదని చెప్పాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఇదంతా ఫేక్ అని ప్రస్తుతం తెలిపింది.

వాస్తవానికి ఇదంతా చేయడానికి గల కారణం అటెన్షన్ కోసమట. తనపై ఎక్కువ జాతీయ స్థాయిలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసి, ఆర్మీలో పెద్ద పదవి పొందేందుకు షైన్ కుమార్ ఈ పనికి పాల్పడ్డట్లు తెలిసింది. అతడితో పాటు అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన అనంతరం పోలీసుల విచారణలో ఆర్మీ జవాను స్నేహితుడు ఈ విషయాన్ని బయటికి వెల్లడించాడు. ఇద్దరినీ తొందరలోనే కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వీపుపై పేరు రాసుకోవడానికి వారు ఉపయోగించిన రంగు, బ్రష్ లాంటి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.