బర్త్‌ డే పార్టీ… జైలు పాలు చేసింది

  • Publish Date - May 12, 2019 / 03:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో యువకుడి బర్త్‌ డే పార్టీ… పలువుర్ని జైలు పాలు చేసింది. చైతన్యరెడ్డి అనే యువకుడు…పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకోవాలని భావించాడు. స్నేహితులకు చెప్పి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు. మార్టేరులోని మాణిక్యం కళ్యాణ మండపంలో మందు, ముక్కతో పాటు అమ్మాయిలు కూడా ఉండాలని ప్లాన్‌ వేసుకున్నాడు. 

రేవ్‌ పార్టీ తరహాలో బర్త్‌ డే బాయ్ చైతన్యరెడ్డి ఏర్పాట్లు చేయడంతో స్నేహితులు కూడా ఉత్సాహంతో వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళ్యాణ మండపంపై దాడి చేసి నలుగురు యువతులతో పాటు చైతన్య, అతని స్నేహితుడు అబ్రహంను అదుపులోకి తీసుకున్నారు.