హాస్యనటుడు సెంథిల్‌పై కేసు నమోదు

  • Publish Date - April 10, 2019 / 07:13 AM IST

సీనియర్‌ హాస్యనటుడు సెంథిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ తరపున తేని పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న తంగ తమిళ్‌సెల్వన్‌కు మద్దతుగా సెంథిల్‌ ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 9 మంగళవారం సెంథిల్‌కు పోడి టీవీకేకే ప్రధాన రోడ్డులో ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినా ఆయన ప్రచార వ్యాన్ ను ఆ ప్రాంతంలో నిలిపి ప్రచారం చేశారు. దీంతో ఆ ప్రాతంలోని ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఉదయకుమార్‌ పోడి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సెంథిల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సెంథిల్‌ తోపాటు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అదేవిధంగా పోడిలోని వార సంత సమీపంలోని కళ్యాణమండపంలో అన్నాడీఎంకేకు చెందిన కార్యకర్తలు ప్రజలకు చీర, పంచెలు పంచుతున్నారన్న సమాచారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శివప్రభుకు అందడంతో ఆయన ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనాథ్‌కుమార్, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
Read Also : ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్