గంటల వ్యవధిలోనే లంగర్ హౌస్ డబుల్ మర్డర్ కేసుని చేధించిన పోలీసులు

హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో శుక్రవారం(జూన్ 5,2020) అర్ధరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు గంటల

  • Publish Date - June 6, 2020 / 06:03 AM IST

హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో శుక్రవారం(జూన్ 5,2020) అర్ధరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు గంటల

హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో శుక్రవారం(జూన్ 5,2020) అర్ధరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రధాన నిందితుడు, రౌడీషీటర్‌ హర్షద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్లు అబూ, చాంద్‌ మహ్మద్‌ను హర్షద్ గ్యాంగ్ కత్తులతో నరికి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. క్వాలిస్ వాహనంలో ఆరుగురు వచ్చి హత్య చేసినట్టు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, వారు ముంబై వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షలు, ఆధిపత్య పోరు నేపథ్యంలోనే హత్యలు జరిగినట్టు విచారణలో తేలింది. కొన్నాళ్ల నుంచి ఇబ్రహీం నుంచి తప్పించుకుని ముంబైలో తలదాచుకున్న చాంద్.. లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలిసింది. గచ్చిబౌలి, లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చాంద్‌పై ప్రత్యర్ధులు రెక్కీ చేసి ప్లాన్ ప్రకారం దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

డబుల్ మర్డర్ తో లంగర్ హౌస్ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌త్య‌ర్థులు కత్తులతో దాడికి తెగ‌బ‌డ‌టంతో రౌడీ షీటర్లు స్పాట్ లోనే మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై ఉన్న అబూ, చాంద్ లను మొద‌ట‌ కారుతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. మృతులు గోల్కొండ ప్రాంతవాసులు.

Read: హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య