షాకింగ్.. ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్, రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. వీడియో వైరల్..
ఇలాంటి ప్రమాదాల గురించి తెలిసినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.
- Naveen
- Published On : September 8, 2024 / 01:06 AM IST
Viral Video : ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. ఇయర్స్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతూ ట్రైన్ ఢీకొని పలువురు చనిపోయారు. ఇలాంటి ప్రమాదాల గురించి తెలిసినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే క్రాసింగ్ దాటుతున్న కానిస్టేబుల్ ను రైలు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన షాజహాన్ పూర్ లోని ఇందిరానగర్ లో జరిగింది. ఆ కానిస్టేబుల్ పేరు అక్షయ్ వీర్ సింగ్. వయసు 24 ఏళ్లు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే క్రాసింగ్ చేస్తుండగా రైలు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు కోల్పోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, అధిక రక్త్రస్రావం కారణంగా కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వేగంగా వస్తున్న రైలును కానిస్టేబుల్ గమనించలేకపోయాడు. అదే ఇంతటి అనర్థానికి దారి తీసిందంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#शाहजहांपुर-सिपाही की ट्रेन से कटकर दर्दनाक मौत..रेलवे क्रॉसिंग को पार करते समय हुआ हादसा..सिपाही अक्षवीर पुलिस लाइन में था तैनात..थाना सदर बाजार के इंद्रा नगर रेलवे फाटक की घटना..#Shahjahanpur pic.twitter.com/PGCICz4MPz
— Vinit Tyagi(Journalist) (@tyagivinit7) September 6, 2024
Also Read : ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటున్న గ్యాంగ్ అరెస్ట్.. రూ.5.6 కోట్లు వసూలు చేసిన ముఠా
