హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం. సుధాకర్ తోపాటు అతని భార్యను తెలంగాణ పోలీసులు ఫిభ్రవరి 13 బుధవారం మీడియా ముందు ప్రవేపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వివరాలను వీడియాకు వివరించారు.
సుధాకర్ స్వస్థలం నిర్మల్ జిల్లా సంగాపూర్ అని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 1983లో ర్యాడికల్ గ్రూప్ లో సుధాకర్ పనిచేశాడు. ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ కు ఆకర్షితులయ్యాడని చెప్పారు. చుదువుకునే వయసులోనే విప్లవభావజాలానికి ఆకర్షితుడయ్యాడని పేర్కొన్నారు. సుధాకర్ పలుమార్లు అరెస్టయ్యాడని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుతున్నానని డీజీపీ అన్నారు. ఏడాది క్రితం నుండే సుధాకర్ లొంగిపోవాలని భావించాడని తెలిపారు.
సుధాకర్ అలియాస్ కిరణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో సుధాకర్ క్రియాశీలక పాత్ర పోషించారు. సుధాకర్, భార్య మాధవి 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో సుధాకర్ చురుకుగా పాల్గొన్నాడు. అనేక ఎన్ కౌంటర్లలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కూడా వారిపై కేసులు ఉండటం వల్ల ఇక్కడి తీసుకొచ్చి వారిని విచారిస్తున్నారు. పోలీసులకు లొంగిపోయారు కాబట్టి వారిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసే అవకాశం ఉంది.