గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారిస్తున్నారు. అలాగే కిడ్నాపర్ శామ్యూల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ పత్తిపాడులో ఉన్నట్టు తెలుసుకున్నారు. అతడి కోసం సెర్చ్ చేస్తున్నారు.
తాడేపల్లిలోని అమర్ రెడ్డి కాలనీకి చెందిన పార్థసారథి(6) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కాగా, బాలుడి తండ్రి శ్రీనివాసరావే డబ్బు కోసం ఈ కిడ్నాప్ కి చేయించాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శామ్యూల్ అనే వ్యక్తి ద్వారా బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు సమాచారం. రూ.5లక్షలు ఇస్తేనే బాలుడిని అప్పగిస్తామని కిడ్నాపర్ చెప్పినట్లు బాలుడి తల్లి తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బాలుడి తండ్రిని, శామ్యూల్ సోదరుడు అబ్రహంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిడ్నాపర్ కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ కిడ్నాప్ జరిగింది. బాలుడు పార్థసారథి స్థానిక మండల పరిషత్ స్కూల్ లో చదువుతున్నాడు. బాబుని తల్లే రోజూ స్కూల్ కి తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడి తండ్రి కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. పనికి కూడా పోవడం లేదని బాలుడి తల్లి తెలిపింది. కొడుకు క్షేమ సమాచారం గురించి తల్లి ఆందోళన చెందుతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కొడుకు ఎక్కడున్నాడో గుర్తించి క్షేమంగా తన దగ్గరికి చేర్చాలని పోలీసులను కోరింది.