Lakshettipet Woman Protest
Love Cheating : ప్రేమించి పెళ్లి చేసుకుని… గర్భం దాల్చగానే భార్యను వదిలేసి పారిపోయిన భర్త కోసం ఓ ఇల్లాలు నిరసన దీక్ష చేపట్టింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే యువతి.. మోదెల గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే వ్యక్తితో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ 2001 నవంబర్ 21 న పెళ్ళి చేసుకున్నారు.
ఇటీవల స్వప్న గర్భవతి అయ్యింది. ఆమె గర్భం దాల్చిన కొన్నాళ్లకు భర్త శ్రీధర్ ఆమెను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతనికోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని గర్బవతిని చేసి తనను మోసం చేసి భర్త పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త తనతో కలిసిఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. పోలీసులు స్పందించక పోవటంతో సోమవారం ఉదయం లక్సెట్టిపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతోంది. జోరున వర్షంలో తడుస్తూ అలాగే కూర్చుంది. పోలీసులు తన భర్తను తీసుకువస్తానని హమీ ఇచ్చేంత వరకు నిరసన చేపడతానని ఆమె చెపుతోంది.
Also Read : Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్