వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిందితులకు షాద్ నగర్ పీఎస్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు. నిందితులను కోర్టుకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తహసీల్దార్ ను రప్పించారు. తహసీల్దార్ ముందు నిందితులను హాజరుపరిచారు.
సీఐ ఛాంబర్ లో తహసీల్దార్ ముందు నిందితులను హాజరు పరిచారు. నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు. దాదాపు నిందితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ పూర్తిస్థాయిలో పరిస్థితులు సద్దుమనిగే వాతావరణం కనిపించలేదు. ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎవరినీ కూడా లోపలికి వెళ్లనివ్వలేదు.
ప్రజలు సంయమనం పాటించాలని శంషాబాద్ డీసీపీ తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చేస్తామన్నారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కానీ యువత లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు బారీ కేడ్లతో వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. బిల్డింగ్స్ పైన భారీగా జనాలు ఉన్నారు. నిందితులు బయటికి వస్తే వారిపై దాడి జరిగే అవకాశం ఉంది. భద్రత కూడా కఠినతరంగా మారింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రికత్త కొనసాగుతోంది.
ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు వస్తున్నారు. బారికేడ్లు, పోలీసు వ్యవస్థ, అదనపు బలగాలు వారిని అదుపు చేయలేని పరిస్థితి ఉంది. పరిస్థితుల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు, కోర్టుకు నిందితులను తీసుకెళ్లడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు. తహసీల్దార్ నే పోలీస్ స్టేషన్ కు రప్పించారు. మేజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరు పరిచారు. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపిస్తోంది.