×
Ad

Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని పూణేలో  విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.

  • Published On : February 4, 2022 / 08:42 AM IST

Pune Building collapse

Building Collapse :  మహారాష్ట్రలోని పూణేలో  విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు. పూణేలోని ఎరవాడ శాస్త్రి నగర్‌లో ఓ‌ షాపింగ్‌మాల్ కడుతున్నారు. అందులో భాగంగా శ్లాబ్ వేయటం కోసం సెంట్రింగ్ పని చేస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న ఐదుగురు భవన  నిర్మాణ కార్మికులు అక్కడి కక్కడే చనిపోయారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : Exams in Bihar : కారు హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన 12వ తరగతి విద్యార్ధులు
శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్ధితివిషమంగా ఉందని పూణే డీసీపీ రోహిదాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని…. బాధితులంతా బీహార్కు చెందినవారని.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు.