Exams in Bihar : కారు హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన 12వ తరగతి విద్యార్ధులు

బీహార్ లోని ఒక స్కూల్ లో 12వ తరగతి విద్యార్ధులు కార్ల హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి.

Exams in Bihar : కారు హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన 12వ తరగతి విద్యార్ధులు

Bihar Board School Exams

Exams in Bihar : స్కూళ్లలో సౌకర్యాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. అరకొర సౌకర్యాలతో విద్యార్ధులు చదువుకుంటూ ఉంటారు. బీహార్ లోని ఒక స్కూల్ లో 12వ తరగతి విద్యార్ధులు కార్ల హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి.

12వ తరగతి ఫైనల్ పరీక్షలను బీహార్ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరి పట్టణంలోని మహారాజా హరేంద్ర కిషోర్ కళాశాలలో 12వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రంలో మంగళవారం, ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం కొందరు విద్యార్ధులు కారు హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు  రాష్ట్ర   ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఘటనపై బీహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి గురువారం వివరణ ఇచ్చారు. ఆ కేంద్రలోని పరీక్షా సమయంలో ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన చెప్పారు.

Also Read :Statue Of Equality : రేపు హైదరాబాద్‌కు ప్రధాని.. సమతామూర్తి విగ్రహ ఆవిష్కారం

మరో వైపు అధికారులు కూడా ఈ ఘటన పై వివరణ ఇచ్చారు. ఆపరీక్షా కేంద్రంలో 12 వతరగతి పరీక్ష వాస్తవానికి మధ్యాహ్నం గం.1-45 నిమిషాలుక ప్రారంఙం కావల్సి ఉండగా…..స్ధానిక ఏర్పాట్లలో లోపంతో సాయంత్రం గం.4-30 కి ప్రారంభమయ్యిందని చెప్పారు. దీంతో సాయంత్రం ఆరుగంటల తర్వాత చీకటి పడటంతో …. స్కూల్ లో విద్యుత్ సౌకర్యం లేక పోవటంతో కారు హెడ్ లైట్ వెలుతురుతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

కాగా… పరీక్ష ఎందుకు ఆలస్యంగా ప్రారంభం అయ్యిందో విచారణ చేస్తున్నామని చంపారన్ జిల్లా విద్యాశాఖాధి కారి సంజయ్ కుమార్ తెలిపారు.