కట్టుకున్నవాడు ఎన్ని హింసలు పెట్టిన భరించే భార్యలు సహనం కోల్పోతే అపర కాళికలే అవుతారు. అలా భర్త తన తోడబుట్టిన చెల్లెలిపై చేసిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న ఓ భార్య భర్త అని కూడా చూడకుండా చంపి పాతిపెట్టేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని సికార్ నగరానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జూన్ 2,2020న జరిగింది.
తొమ్మిది నెలల నిండు గర్భిణీగా ఉన్న ఆమె..తనకు సహాయంగా ఉంటుందని తన 8 వతరగతి చదువుతున్న చెల్లెలిని తెచ్చుకుంది. అక్క ఆలనా పాలనాతో పాటు అక్కకు అంతకుమందు పుట్టిన ఐదేళ్ల బిడ్డను కూడా చూసుకుంటోంది. ఈ క్రమంలో భార్య చెల్లెలిపై భర్త కన్నేశాడు. ఎలాగైనా సరే లొంగదీసుకోవాలనుకుని సమయం కోసం కాపుకాశాడు. అలా ఓ రోజు మరదలిపై అత్యాచారానికి యత్నించాడు.
దీంతో ఆమె గట్టిగా అరుస్తూ..వదిలిపెట్టమంటూ వేడుకుండి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ పశువు వినిపించుకోలేదు. చెల్లెలి ఏడుపులు విన్న ఆమె గబగబా వచ్చింది. భర్త చెల్లెలిపై అత్యాచారానికి యత్నించటం చూసింది. అంతే ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుభికింది. వదిలిపెట్టమని ఘర్జించింది. కానీ వాడు వదల్లేదు.
అంతే కోపంతో ఊగిపోతూ..అక్కడే ఉన్న ఓ ఐరన్ రాడ్డుతో భర్తపై దాడి చేసింది. కోపం తగ్గేదాకా కొట్టి కొట్టింది. ఆ దెబ్బలకు తీవ్రంగా గాయలై భర్త చనిపోయాడు. ఆ తరువాత భర్త మృతదేహాన్ని లాక్కెళ్లి ఇంటి పెరటిలో గొయ్యితీసి పాతి పెట్టేసింది. ఆ తరువాత రక్తంతో తడిచిపోయిన పరుపును పెరటిలో వేసి తగులబెట్టేసింది. కొన్ని గంటల తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కానీ ఈ కేసుపై పోలీసులు వెర్షన్ వేరుగా ఉంది. దీనిపై జైపూర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎస్.సెంగతిర్ మాట్లాడుతూ..నిందితురాలు తన మైనర్ చెల్లెలిపై భర్త అత్యాచారం చేశాడనీ..ఆ తరువాత ఆమెను చంపేద్దామని భర్త నిర్ణయించుకున్నట్లుగా ఆమెకు తెలిసింది.దీంతో ఆమె భర్తను హత్య చేసిందని చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read: పంజరంలో చిలుకలు ఎగిరిపోయాయని 8 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపేశారు