దారుణం : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.

  • Publish Date - March 22, 2019 / 02:48 AM IST

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.

హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఏఆర్ కే హోమ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో 6 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశారు. ముళ్ల పొదల్లో చిన్నారి పడి ఉందన్న సమచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై లైంగిక దాడి చేసి, ఆపై చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు.. అదే ప్రాంతానికి చెందిన కిష్టమ్మ, చంద్రం దంపతుల కుమార్తెగా గుర్తించారు. 
Read Also : తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

గురువారం మధ్యాహ్నమే అల్వాల్ పీఎస్‌లో చిన్నారి మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే ట్రాగ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు, చిన్నారి ఉంటున్న అపార్ట్ మెంట్ కు చెందిన ఫుటేజీని పోలీసులు సేకరించారు. బీహార్‌గ్యాంగ్‌పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కూతురును హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
Read Also : OMG : హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. 1600 మంది వీడియోలు రికార్డ్, లైవ్‌లో ప్రసారం