మోడల్‌పై అత్యాచారం..వీడియో : హైదరాబాద్ లో మరో దారుణం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన..

  • Publish Date - January 11, 2020 / 01:14 AM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన.. బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా.. మరో వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరించారపి బాధితురాలు ఆరోపించింది.

దిశ హత్యాచారంపై దేశమంతటా చర్చ జరిగినా.. ఎన్ కౌంటర్ చేసినా.. చట్టాలు అమల్లోకి వచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ రేపిస్టులను త్వరలోనే ఉరితీయబోతున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున మరో దారుణం జరిగింది. తెలంగాణ మిస్‌ మోడల్‌కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపైన ఇద్దరు యువకులు పైశాచికంగా దాడి చేశారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతేకాదు అత్యాచారాన్ని సెల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. డిసెంబర్ 28న జూబ్లిహిల్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ ఘటనకు సంబంధించి గత నెల 28న బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం జనవరి 7న ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. 

జరిగిన ఘోరంపై ఫిర్యాదు చేసినా జూబ్లీహిల్స్ పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలు వాపోయింది. కేసు నీరుగారుస్తున్నారని మీడియా ముందు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఘటన జరిగిన రోజే తాను జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. పోలీసులు కావాలనే కేసును నీరుగారుస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

* తెలంగాణ మిస్‌ మోడల్‌కు ప్రయత్నిస్తున్న యువతిపై రేప్
* బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం
* అత్యాచారాన్ని వీడియో తీసిన కామాంధులు
* డిసెంబర్ 28న జూబ్లిహిల్స్‌లో ఘటన 
* జనవరి 7న ఫిర్యాదు నమోదు 
* ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులు 
* కేసు నీరుగారుస్తున్నారంటూ బాధితురాలి ఆవేదన

Also Read : మసీదులో బాంబు పేలి 8మంది మృతి