Murder Attack On Realtor : హైదరాబాద్‌లో రియల్టర్ పై దాడి-పరిస్ధితి విషమం
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బుధవారం ఉదయం ఒక స్ధిరాస్తి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- chvmurthy
- Published On : October 27, 2021 / 03:06 PM IST
Murder Attck On Realtor
Murder Attack On Realtor : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బుధవారం ఉదయం ఒక స్ధిరాస్తి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో ఉండే స్ధిరాస్తి వ్యాపారి రవీందర్ రెడ్డి ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఉన్న సెల్ ఫోన్ తీసుకుంటూ ఉండగా …… అక్కడే కాపు కాసిన అతని సమీప బంధువు కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో రవీందర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు రవీందర్ రెడ్డిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్ధలం నుంచి నిందితుడు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం
ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మెన్ ను పోలీసులు విచారిస్తున్నారు. స్దిరాస్తి వ్యాపారంలో ఇవ్వాల్సిన మూడున్నర లక్షలరూపాయలే గొడవకు కారణమని తెలుస్తున్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
